Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జెర్సీ' .. రమణ్ లంబా బయోపిక్ కాదు: నాని

  • చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడేవాడిని
  •  'మజిలీ' నేను ఇంకా చూడలేదు
  • 'జెర్సీ' హిట్ అవుతుందనే నమ్మకం వుంది     
నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' సినిమా రూపొందింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం .. గల్లీ క్రికెట్ ఆడేవాడిని. అలాంటి నాకు .. క్రికెటర్ గా తెరపై చూసుకునే అవకాశం లభించింది.

ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన తరువాత ఇది 'రమణ్ లంబా' బయోపిక్ అనే ప్రచారం మొదలైంది. కానీ ఇది 'రమణ్ లాంబా' బయోపిక్ కాదు .. ఇది ఫిక్షనల్ స్టోరీ అనే విషయం సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. ఇక 'మజిలీ' కథకు .. 'జెర్సీ'కి మధ్య పోలికలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు .. నేను ఇంకా 'మజిలీ' చూడలేదు. డేనియల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుని మరీ 'జెర్సీ'లో నటించాను. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
nani
shraddha srinadh

More Telugu News